ఫిట్ నెస్ టెస్టు పాసైన రోహిత్ శర్మ…ఆస్ట్రేలియా టూర్ కు ఓకే

ఫిట్ నెస్ టెస్టు పాసైన రోహిత్ శర్మ…ఆస్ట్రేలియా టూర్ కు ఓకే

టీమిండియా డాషింగ్ క్రికెటర్ రోహిత్ శర్మ ఇటీవల ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డాడు. దాంతో ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మను ఎంపికచేయలేదు. ఈ క్రమంలో రోహిత్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందాడు. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మకు ఇవాళ(శుక్రవారం) వైద్య బృందం ఫిట్ నెస్ టెస్టు నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో ఈ టెస్టు చేపట్టారు. ఈ పరీక్షలో హిట్ మాన్ రోహిత్ తన ఫిట్ నెస్ నిరూపించుకున్నాడు.దీంతో ఆస్ట్రేలియా వెళ్లేందుకు లైన్ క్లియర్ అయ్యింది.

అయితే.. ఆస్ట్రేలియాలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని క్వారంటైన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. దాంతో రోహిత్ నాలుగు టెస్టుల సిరీస్ లో చివరి రెండు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. డిసెంబరు 14న ఆస్ట్రేలియాకు వెళ్లనున్న రోహిత్ కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే.

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ డిసెంబరు 17న ప్రారంభం కానుంది. మూడో టెస్టు జనవరి 7 నుంచి షురూ కానుండగా… అప్పటికి రోహిత్ శర్మ క్వారంటైన్ కూడా పూర్తవుతుంది.