IND vs ENG 4th Test: నువ్వు హీరోవి కాదు.. సర్ఫరాజ్‌పై రోహిత్ ఆగ్రహం

IND vs ENG 4th Test: నువ్వు హీరోవి కాదు.. సర్ఫరాజ్‌పై రోహిత్ ఆగ్రహం

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్ లో కూల్ గా కనిపించినా.. అప్పుడప్పుడూ తనలోని దూకుడు కూడా బయటపెడతాడు. అన్ని  రకాల ఎమోషన్స్ చూపిస్తూ కెప్టెన్ గా ఆకట్టుకుంటాడు. ప్లేయర్లకు స్వేచ్ఛనివ్వడంతో పాటు వారు తప్పు చేశారని అనిపిస్తే వెంటనే అరిచేస్తాడు. తాజాగా రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో సర్ఫరాజ్ చేసిన పనికి హిట్ మ్యాన్ కు కోపమొచ్చింది. 

మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సర్ఫరాజ్ బ్యాటర్ కు ఆఫ్ సైడ్ మూడడుగుల దూరంలో ఫీల్డింగ్ చేస్తున్నాడు. స్పిన్ బౌలింగ్ లో క్యాచ్ ల కోసం టెస్ట్ మ్యాచ్ లో ఇక్కడ ఫీల్డింగ్ పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఇక్కడ ఉండే ఫీల్డర్లు హెల్మెట్ ఖచ్చితంగా ధరిస్తారు. అయితే బ్యాట్స్ మెన్ భారీ షాట్ కొట్టినప్పుడు బాల్ తగిలే ప్రమాదం ఉంటుంది. అయితే సర్ఫరాజ్ మాత్రం  హెల్మెట్ ధరించలేదు. ఇది స్లిప్ దగ్గర నుంచి గమనించిన రోహిత్..సర్ఫరాజ్ నువ్వు హీరోవి కాదు.. వెంటనే హెల్మెట్ పెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో హెల్మెట్ తెప్పించుకుని పెట్టుకుని ఫీల్డింగ్ చేశాడు.

కెప్టెన్ గా రోహిత్ సహచర ఆటగాడి విషయంలో బాధ్యత తీసుకొని వార్నింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హిట్ మ్యాన్ పై నెట్టింట్లో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా నాలుగో రోజు మొదటి సెషన్ ప్రారంభించింది. ప్రస్తుతం వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (47) గిల్ (1) క్రీజ్ లో ఉన్నారు. 37 పరుగులు చేసిన జైశ్వాల్ రూట్ బౌలింగ్ లో ఔటయ్యాడు. భారత్ విజయానికి మరో 107 పరుగులు కావాలి.