Rohit Sharma: ఈ రోజు ఎప్పటికీ గొప్పే: 18 సంవత్సరాల క్రికెట్ ప్రయాణంపై రోహిత్ ఎమోషనల్

Rohit Sharma: ఈ రోజు ఎప్పటికీ గొప్పే: 18 సంవత్సరాల క్రికెట్ ప్రయాణంపై రోహిత్ ఎమోషనల్

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. భారత క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్ గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో హిట్ మ్యాన్ రికార్డ్ అత్యద్బుతమనే చెప్పాలి. వన్డేల్లో 11 వేలకు పైగా పరుగులు టీ 20 ఫార్మాట్ లో 4 వేలకు పైగా పరుగులు చేసి పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆల్ టైం బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. జూన్ 23, 2007న అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. నేటితో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన అరంగేట్ర తేదీ గుర్తు పెట్టుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం వైరల్ గా మారుతుంది. 

ALSO READ | సీఎం పదవి ఇచ్చినా వద్దు.. పొలిటికల్ ఎంట్రీపై గంగూలీ ఫుల్ క్లారిటీ

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. రోహిత్ తన హెల్మెట్ ను పోస్ట్ చేసి, దానిపై "ఎప్పటికీ కృతజ్ఞతగల 23.06.07" అని క్యాప్షన్ ఇచ్చాడు. రోహిత్ శర్మ జూన్ 23, 2007న తన వన్డే అరంగేట్రం చేసాడు. 2007 సెప్టెంబర్ 19న టీమిండియా తరపున తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. ద్రవిడ్, లక్ష్మణ్, సచిన్ మిడిల్ ఆర్డర్ లో పాతుకుపోవడంతో టెస్టుల్లో రోహిత్ డెబ్యూకు చాల సమయం పట్టింది. గత 12 సంవత్సరాలుగా రోహిత్ శర్మ భారత జట్టుకు ఓపెనర్ గా సేవలను అందిస్తున్నాడు. తన వన్డే కెరీర్ లో ఇప్పటివరకు 273 వన్డేల్లో  48.76 యావరేజ్ తో 11,168 పరుగులు చేశాడు. 159 టీ20ల్లో 4231 పరుగులు.. 67టెస్టుల్లో 4301 పరుగులు చేశాడు.   

ముంబై వాంఖడే స్టేడియానికి రోహిత్ శర్మ పేరు: 

రోహిత్ శర్మ భారత జట్టుకు చేసిన కృషికి ఫలితం లభించింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ రోహిత్ భారత క్రికెట్ కు చేసిన సేవలకు గాను గుర్తింపుగా వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్ కు తన పేరును పెట్టారు. వాంఖడేలో ఇప్పటికే స్టాండ్‌ల పేరు పెట్టబడిన సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, విజయ్ మర్చంట్ వంటి  దిగ్గజాల సరసన రోహిత్ చేరాడు.గత నెలలో జరిగిన ముంబై క్రికెట్ అసోసియేషన్ 86వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు.

ఒక్కడే 17 ఐసీసీ ట్రోఫీలు: 

టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డ్ ఒకటి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎవరికీ తెలియని ఐసీసీ రికార్డ్ హిట్ మ్యాన్ ఖాతాలో ఉండడం విశేషం. అదేంటో కాదు ఇప్పటివరకు రోహిత్ ఏకంగా 17 ఐసీసీ ట్రోఫీలు ఆడడం విశేషం. తొలి సారి 2007 టీ20 వరల్డ్ కప్ తో తన ఐసీసీ జర్నీ స్టార్ట్ చేసిన రోహిత్ ఇప్పటివరకు జరిగిన 9 టీ20  వరల్డ్ కప్ టోర్నీలు ఆడాడు. 3 వన్డే ప్రపంచ కప్‌లతో పాటు.. రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో రోహిత్ భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు.

రోహిత్ శర్మ కెరీర్: 

రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2024లో టీ20 వరల్డ్ కప్ గెలవడంతో పాటు 2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. బ్యాటర్ గా మూడు ఫార్మాట్ లలో 19 వేలకు పైగా పరుగులు చేశాడు. ముంబై తరపున హిట్ మ్యాన్ 46 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 17 లిస్ట్ ఏ గేమ్‌లతో పాటు 25 టీ20లు ఆడాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఇటీవలే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. దీంతో రోహిత్ ఇకపై టీమిండియా తరపున వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతాడనే టాక్ వినిపిస్తుంది.