SRH vs MI: ముంబై కెప్టెన్‌గా రోహిత్.. హార్దిక్‌ను ఏమన్నాడంటే..?

SRH vs MI: ముంబై కెప్టెన్‌గా రోహిత్.. హార్దిక్‌ను ఏమన్నాడంటే..?

ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ రంగంలోకి దిగాడు. అదేంటి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య కదా.. మరి రోహిత్ కెప్టెన్ ఏంటి అనే అనుకుంటున్నారా.. నిజానికి హిట్ మ్యాన్ కెప్టెన్సీ చేసింది తాత్కాలికంగా మాత్రమే. నిన్న(మార్చి 27) ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. బౌలర్ల రొటేషన్ విషయంలో హార్దిక్ పాండ్య తడబడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. 

ఈ సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తమ జట్టు కష్టాల్లో ఉండడం చూసి కెప్టెన్ గా ఛార్జ్ తీసుకున్నాడు. ఫీల్డింగ్ సెట్ చేస్తూ కనిపించాడు. ఈ క్రమంలో కెప్టెన్ పాండ్యను బౌండరీ లైన్ వెద్దకు వెళ్లి ఫీల్డింగ్ చేయమని ఆదేశించాడు. అప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాండ్య రోహిత్ మాట కాదనకుండా బౌండరీ లైన్ దగ్గరకు వెళ్లి ఫీల్డింగ్ చేశాడు. దక్షిణాఫ్రికా జోడీ క్లాసన్, మార్కరంను ఆపలేక హార్దిక్ స్వయంగా రోహిత్ దగ్గరకు వెళ్లి సలహాలు తీసుకోవడం విశేషం. రోహిత్ కెప్టెన్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Also Read: సన్ రైజర్స్ విక్టరీతో.. స్టేడియంలో డాన్స్ చేసిన కావ్య

హై స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 31 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై 246 పరుగులకే పరిమితమైంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్  20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన క్లాసన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.