
పారిస్ ఒలింపిక్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మహిళల 76 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడిన రోమేనియన్ రెజ్లర్ కాటాలినా అక్సెంటే తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. శనివారం(ఆగష్టు 10) జరిగిన బౌట్‌లో తన అమెరికన్ ప్రత్యర్థి కెన్నెడీ బ్లేడ్స్ ఆమెను వెనక్కి విసిరేసింది. దాంతో, ఆమె తల బలంగా నేలను తాకడంతో వేదికపైనే కుప్పకూలింది.
వెంటనే వైద్య సిబ్బంది ఆమెను స్ట్రెచర్‌పై లోపలకి తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆమె స్పృహలో ఉన్నప్పటికీ, శరీరాన్ని కదలించలేకపోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అత్యాధునిక వైద్యం కోసం ఆమెను ప్రాథమిక చికిత్స అనంతరం ఒలింపిక్ విలేజ్ నుంచి పారిస్‌లోని ఓ ప్రముఖ తరలించారని తెలుస్తోంది. ఈ ఘటన నుంచి ఆమె ప్రాణాలతో బయటపడ్డా.. కోలుకోవడానికి ఆరు నెలల నుంచి ఏడాది పాటు సమయం పట్టొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆక్సెంటే రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత.
?♀️ ABD'li güreşçi Alexis Blades'in bu puanı sonrası Romanyalı Catalina Axente sakatlandı ve sedyeyle minderden alındı. #Paris2024 pic.twitter.com/MAyUVxBDmC
— gdhspor (@gdh_spor) August 10, 2024
#Paris2024 Olimpiyat Oyunları'nda güreş müsabakalarında Romanyalı kadın sporcu Catalina Axente, rakibinin hamlesi sonrası boynunu sert şekilde yere vurdu ve minderden sedyeyle çıkarıldı. pic.twitter.com/0OImHxen55
— Spor Arena (@sporarena) August 10, 2024