ఇన్​స్టాగ్రామ్​లో రొనాల్డో హిస్టరీ

ఇన్​స్టాగ్రామ్​లో రొనాల్డో హిస్టరీ
  • 30 కోట్ల ఫాలోవర్లతో రికార్డు

న్యూఢిల్లీ:  ఎప్పుడూ ఫుట్​బాల్​ గ్రౌండ్​లో సంచలనాలు సృష్టించే పోర్చుగల్​ సాకర్​ సూపర్​ స్టార్​ క్రిస్టియానో రొనాల్డో.. సోషల్​ మీడియాలోనూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ఇన్​స్టాగ్రామ్​లో 30 కోట్ల (300 మిలియన్స్​) మంది ఫాలోవర్లు కలిగిన ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా రొనాల్డో నిలిచాడు. ఈ సాకర్​ స్టార్​ శుక్రవారం ఈ ఫీట్​ సాధించాడు. ఇన్​స్టాగ్రామ్​లో 200 మిలియన్​ ఫాలోయర్స్​ మార్కు అందుకున్న తొలి వ్యక్తి కూడా రొనాల్డోనే కావడం విశేషం. రెజ్లర్ నుంచి హాలివుడ్​ యాక్టర్​గా మారిన డ్వేన్​ జాన్సన్​( ద రాక్​) 246 మిలియన్​ ఫాలోవర్స్​తో రొనాల్డో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక, టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీని ఇన్​స్టాగ్రామ్​లో 128 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.