
గజ్వేల్, వెలుగు: గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగుపల్లి ప్రైమరీ స్కూల్ పైకప్పు పెచ్చులూడింది. ఈ సమయంలో విద్యార్థులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బుధవారం స్కూల్ తెరిచే సరికి పైకప్పు సీలింగ్ కింద పడి ఉండడంతో టీచర్లు, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. టీచర్లు పెళ్లలను పక్కకు తొలగించి.. మరోచోట స్టూడెంట్లను కూర్చోబెట్టారు.