
- గాలివానకు కొట్టుకుపోయిన రేకులు
- తాత్కాలిక పనులు చేపట్టిన కాంట్రాక్టర్
లక్సెట్టిపేట, వెలుగు: గత ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ ఆసుపత్రి తాత్కాలిక భవనం రేకులు కూలిపోయి వర్షం నీటికి సామగ్రి ధ్వంసమయింది. వారం క్రితం చేయాల్సిన మరమ్మతు పనులు నష్టం జరిగిన తర్వాత సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. దీంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి నూతన భవనం మంజూరు కావడంతో జనవరిలో ప్రభుత్వాసుపత్రిని తాత్కాలికంగా పాత ఎంపీడీవో ఆఫీసులోకి మార్చారు. ఈ భవనంపై రేకులను వారం రోజుల క్రితమే మార్చాల్సి ఉంది.
కానీ కాంట్రాక్టర్ జాప్యం కారణంగా గాలివానకు రేకులు కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఇన్ పేషెంట్ సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు మండలాల రోగులకు ఈ ఆసుపత్రి సేవలందిస్తుంది. ఈ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి ప్రభుత్వ ఆసుపత్రి లో ధ్వంసమైన సామగ్రికి కాంట్రాక్టర్ నష్ట పరిహారం చెల్లించాలనిబీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆస్పత్రిని సందర్శించిన అనంతరం వారు మాట్లాడుతూ.. వంద పడకల ఆసుపత్రిని 30 పడకలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్
నాయకులదేనని ఎద్దేవా చేశారు.