
న్యూఢిల్లీ: ఓబెన్ ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రోర్ఈజెడ్ బైక్‌ను ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు తమ ఇళ్ల నుంచే రోర్ఈజెడ్ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది కేవలం 2 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 187 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
ఇది అత్యాధునిక బ్యాటరీ, మోటార్ కనెక్టెడ్ ఫీచర్లతో వస్తుంది. స్మార్ట్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. వెనుక కూర్చునే వారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని ఓబెన్ తెలిపింది. ధర రూ.1.30 లక్షలని పేర్కొంది.
Oben Rorr EZ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 3.4 kWh వేరియంట్ ధర రూ.1లక్షా19వేల 999 , రెండో వేరియంట్ 4.4 kWh ధర రూ.1లక్షా 29వేల999 లభిస్తోంది. ఈ ధరలు ఒరిజినల్ ధరపై రూ.20వేల తగ్గింపుతో ఉన్నాయి.
ఫీచర్లు ,స్పెసిఫికేషన్లు
టాప్ స్పీడ్: 95 కి.మీ/గం
యాక్సిలరేషన్: 0-40 కి.మీ/గం కేవలం 3.3 సెకన్లలో
టార్క్: 52 Nm
రేంజ్:175 కి.మీ వరకు (బ్యాటరీ వేరియంట్‌ను బట్టి)
2.6 kWh వేరియంట్:110 కి.మీ
3.4 kWh వేరియంట్: 145 కి.మీ
4.4 kWh వేరియంట్: 187కి.మీ
డ్రైవ్ మోడ్‌లు: ఎకో, సిటీ, హావాక్
కనెక్టివిటీ,భద్రతా ఫీచర్లు:
- జియో-ఫెన్సింగ్ (Geo-Fencing)
- థెఫ్ట్ ప్రొటెక్షన్ (Theft Protection)
- యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్ (Unified Brake Assist - UBA)
- డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్ (Drive Assist System - DAS)
- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్
- GPS ,నావిగేషన్
- బ్లూటూత్ కనెక్టివిటీ
- కాల్/SMS అలర్ట్‌లు
- USB ఛార్జింగ్ పోర్ట్
- డిజైన్ ,కలర్స్..
నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో..
- ఎలక్ట్రో అంబర్ (Electro Amber)
- సర్జ్ సయాన్ (Surge Cyan)
- లుమినా గ్రీన్ (Lumina Green)
- ఫోటాన్ వైట్ (Photon White)
- నియో-క్లాసిక్ డిజైన్ ,రెట్రో
ఓబెన్ ఎలక్ట్రిక్ తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 50కి పైగా నగరాల్లో 150 షోరూమ్‌లకు విస్తరించాలని యోచిస్తోంది. ఈ అవుట్‌లెట్‌లలో అమ్మకాల తర్వాత సేవలను అందించడానికి సర్వీస్ సెంటర్‌లు కూడా ఉంటాయి.