Beauty tips: రోజ్ వాటర్తో ఎన్నో ఉపయోగాలు..ఇలా వాడితే మరెన్నో ప్రయోజనాలు

Beauty tips: రోజ్ వాటర్తో ఎన్నో  ఉపయోగాలు..ఇలా వాడితే మరెన్నో ప్రయోజనాలు

రోజ్ వాటర్... అందంగా ఉండాలని కోరుకునే ప్రతి అమ్మాయి ఇంట్లో ఇది తప్పకుండా ఉంటుంది. దీని ధర కూడా అందుబాటులోనే ఉండడంతో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. చర్మం మెరవడానికే కాదు, చర్మ ఆరోగ్యానికి రోజ్ వాటర్ సాయపడుతుంది. స్కిన్ కేర్, మేకప్ ఇప్పుడు ఎంత సహజమైనవి అయితే అంత బావుంటుంది అనుకుంటున్నారు.

అలాంటి వాటి కోసమే సెర్చ్ చేస్తున్నారు. అలాంటివే ఎక్కువ వాడుతున్నారు. అలాంటి ప్రోడక్ట్స్ లో ఒకటి రోజ్ వాటర్. రోజ్ వాటర్ బ్యూటీ ఇన్‌గ్రీడియెంట్ మాత్రమే కాదు. మెంటల్ హెల్త్ బ్యాలెన్సింగ్ కూడా చేస్తుంది. రోజ్ వాటర్ ఇంట్లో ఉంటే చాలు.. ఖరీదైనా టోనర్లు, సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములతో అవసరమే ఉండదు.

రోజ్ వాటర్ ఏం చేస్తుందంటే..

* చర్మంలో పిహెచ్ లెవల్ ని బ్యాలెన్స్ చేస్తుంది. 
* రోజ్ వాటర్లోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు, దురద, తామరని పోగొట్టేందుకు సాయపడతాయి.
* చర్మాన్ని హైడ్రే టెడ్ గా ఉంచుతుంది. మాయిశ్చరైజ్ చేసి ఫ్రెష్ లుక్ ఇస్తుంది. 
* ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ గాయాలను నయం చేస్తాయి. 
* యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాలను బలపరిచి, కొత్త కణాలను ఉత్పత్తి చేస్తాయి.
* రోజ్ వాటర్లోని అరోమా యాంగ్జెటీని పోగొడుతుంది. 
* శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. 
* ఇందులోని ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు కుదుళ్లను బలపరిచి, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. చుండ్రును తగ్గిస్తాయి. 
* దిండుపై కొద్దిగా రోజ్ వాటర్ చల్లుకొని పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. 
* చర్మంపై ముడతలు మచ్చలు తగ్గించి ముసలి తనపు ఛాయల్ని పోగొడుతుంది.