Mowgli2025: ప్రేమపోరాటంలో రోషన్ కనకాల.. భారీ అంచనాలతో డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో మోగ్లీ..

Mowgli2025: ప్రేమపోరాటంలో రోషన్ కనకాల.. భారీ అంచనాలతో డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో మోగ్లీ..

యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ‘కలర్‌‌‌‌‌‌‌‌ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్  నిర్మిస్తున్నారు. సాక్షి మడోల్కర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. బండి సరోజ్ కుమార్, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఫారెస్ట్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగే యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. శనివారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఇప్పటికే నాని వాయిస్ ఓవర్‌‌‌‌‌‌‌‌తో విడుదలైన ఈ మూవీ  గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ప్రేమను రక్షించుకోవడానికి ఎంతదూరమైన వెళ్లే యువకుడిగా రోషన్‌ కనకాల పాత్ర శక్తివంతగా సాగుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. బండి సరోజ్‌కుమార్‌ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.