రాత్రి గస్తీకి వెళ్లిన పోలీసుల కథ: ఈ భయంకరమైన మలయాళం థ్రిల్లర్ చూసేయండి.. తెలుగులోనూ స్ట్రీమింగ్!

రాత్రి గస్తీకి వెళ్లిన పోలీసుల కథ: ఈ భయంకరమైన మలయాళం థ్రిల్లర్ చూసేయండి.. తెలుగులోనూ స్ట్రీమింగ్!

‘మలయాళం సినిమాలెపుడు బోర్ కొట్టనియ్యవు’.. ఇపుడీ ఈ మాట తెలుగు ఆడియన్స్ నోటా పదేపదే వినిపిస్తుంది. ఎందుకంటే.. ఫ్యామిలీ, క్రైమ్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్.. ఇలా ఏ జోనర్లో సినిమా వచ్చిన ఆద్యంతం ఆసక్తి కలిగించేస్తున్నాయని అంటున్నారు. కేవలం 2025లోనే చాలా సినిమాలు సూక్ష్మదర్శిని, టూరిస్ట్ ఫ్యామిలీ, రేఖాచిత్రం, పొన్మాన్, పడక్కలం, తుడురమ్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, అలప్పుజ జింఖానా, L2: ఎంపురాన్, నరివెట్ట, ఐడెంటిటీ ఇలా చాలానే లిస్ట్ ఉంది. ఈ క్రమంలోనే ఎమరో ఇంట్రెస్టింగ్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్కి వచ్చింది. మరి ఆ మూవీ ఏంటీ? అదెక్కడ స్ట్రీమ్ అవుతుందనేది వివరాలు చూసేద్దాం. 

రోంత్ ఓటీటీ:

‘రోంత్’ ఇదొక మలయాళ పోలీస్ ప్రొసీజరల్ థ్రిల్లర్. షాహీ కబీర్‌ తెరకెక్కించాడు. ఇందులో రోషన్ మాథ్యూ మరియు దిలీష్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూన్ 13, 2025న థియేటర్లలలో విడుదలైంది. ఇపుడీ మూవీ ఇవాళ (JULY22) నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. ఇండియాలో మొత్తం రూ.6.58 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.9.81 కోట్ల షేర్ సాధించింది.

డైరెక్టర్ షాహీ కబీర్‌.. గతంలో ‘నాయట్టు’,‘ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ’చిత్రాలకు స్క్రీన్‌ రైటర్‌గా పనిచేసిన అనుభవం.. ఈ సినిమాకు పనిచేసింది. ఒకరోజు రాత్రిలో జరిగిన అంశాలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. దానికితోడు ఆద్యంతం థ్రిల్లింగ్‌గా కథను చెప్పడంలో ఎమోషన్ తో పాటు నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ తీసుకొచ్చాడు. ఇంతకీ సినిమా కథేంటో చూసేయండి.

కథేంటంటే:

రోంత్ అంటే గస్తీ అని అర్థం. నైట్ ప్యాట్రోలింగ్ చేసే ఇద్దరు పోలీసుల కథ ఇది.  సీనియర్ పోలీస్ అధికారి యోహన్నన్ (దిలీప్ పోతన్)తో కలిసి సీపీవో దిన్నాతన్ (రోషన్ మాథ్యూ) వీళ్ళిద్దరూ ధర్మస్థల పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తుంటారు. ఓ రోజు రాత్రి ప్యాట్రోలింగ్ కు వెళ్తారు. అలా ప్యాట్రోలింగ్ వెళ్లిన వాళ్లకు కొన్ని వింత సంఘటనలు ఎదురవుతాయి. మరికాసేపయ్యాక సిటీలో కొన్ని విషయాలు అబ్ నార్మల్ గా ఉన్నట్లు కనిపిస్తాయి.

►ALSO READ | Hari Hara Veera Mallu: తెలంగాణలో ‘HHVM’ పెయిడ్ ప్రీమియర్ షో.. 

ఈ క్రమంలో వాళ్ళు కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఇక అంతా ఒకే అనుకుని ఇంటికి వెళ్తారు. కానీ, అసలు సమస్య అపుడే మొదలవుతుంది. ఊహించని సంఘటనలతో వారి గస్తీ సాగిందని విషయం అర్ధమవుతుంది. మరి వారికి ఎదురైనా సంఘటనలు ఏంటీ? వారు తీసుకున్న నిర్ణయాలేంటీ? అసలు అక్కడ జరిగిన హత్యలేంటీ? అనేది మిగతా కథ.