
గండీడ్, వెలుగు: మహబూబ్‌నగర్‌జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని ఒకటో నంబర్అంగన్వాడీ సెంటర్లో సోమవారం ఓ బాలుడికి ఉడకబెట్టి ఇచ్చిన గుడ్డు పురుగులు పట్టి, కుళ్లిపోయి ఉంది. గమనించిన తల్లిదండ్రులు అంగన్వాడీ టీచర్ లలితను నిలదీశారు.
విషయాన్ని సూపర్వైజర్ దృష్టికి తీసుకెళ్లినట్లు అంగన్వాడీ టీచర్ తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ మల్లమ్మను వివరణ కోరగా, గుడ్డులో పురుగులు వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. మిగిలిన ఏ ఒక్క సెంటర్లోనూతత ఇలా జరగలేదని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. చిన్న పిల్లలకు అందించే గుడ్లు కుళ్లిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.