మార్స్‌‌‌‌పై రోవర్‌‌‌‌ దిగిన వీడియో రిలీజ్‌‌‌‌

మార్స్‌‌‌‌పై రోవర్‌‌‌‌ దిగిన వీడియో రిలీజ్‌‌‌‌

కేప్‌‌‌‌ కార్నివాల్‌‌‌‌: అంగారకుడిపై పర్సివరెన్స్‌‌‌‌ రోవర్‌‌‌‌ దిగినప్పటి వీడియోను నాసా మంగళవారం విడుదల చేసింది. మూడు నిమిషాలున్న ఈ వీడియోలో మార్స్‌‌‌‌ గ్రహంపై పారాచూట్‌‌‌‌ సాయంతో రోవర్‌‌‌‌ దిగడం, గ్రహాన్ని రోవర్‌‌‌‌ తాకుతున్న టైమ్‌‌‌‌లో దుమ్ము లేవడం స్పష్టంగా కనిపించింది. ఫుటేజ్‌‌‌‌ చాలా అద్భుతంగా వచ్చిందని, తామే అక్కడ రైడ్‌‌‌‌ చేస్తున్నట్టు అనిపించిందని నాసా సైంటిస్టులు వెల్లడించారు. ఈ రోవర్‌‌‌‌లో మొత్తం 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లను నాసా సెట్‌‌‌‌ చేయగా ల్యాండింగ్‌‌‌‌ టైమ్‌‌‌‌లో రికార్డు చేయడానికి 7 కెమెరాలను ఆన్‌‌‌‌ చేశారు. మార్స్‌‌‌‌పై ఒకప్పుడు జీవం ఉండేదా లేదా తెలుసుకోవడానికి నాసా పంపిన పర్సివరెన్స్‌‌‌‌ రోవర్‌‌‌‌ గత గురువారమే ఆ గ్రహంపై దిగింది. అక్కడ రెండేళ్ల పాటు ఈ రోవర్‌‌‌‌ పరిశోధన చేయనుంది. గ్రహం ఉపరితలాన్ని, రాళ్లను డ్రిల్‌‌‌‌ చేసి పరిశీలించనుంది. భూమిపైకి మరో పదేళ్లలో చేరుకునే శాంపిళ్లను ఎంపిక చేసి పక్కన పెడుతుంది. మార్స్‌‌‌‌ ఉపరితలం ఫొటోలను రోవర్‌‌‌‌ ఇప్పటికే తీసి పంపగా వాటిలో కొన్నింటిని నాసా వాటిని తాజాగా రిలీజ్‌‌‌‌ చేసింది.

For More News..

మన దేశంపై నుంచి ఇమ్రాన్‌‌‌‌ఖాన్‌‌‌‌ ఫ్లైట్

ప్రెసిడెంట్​ అంకుల్.. ప్లీజ్ మా అమ్మను క్షమించండి..

హైదరాబాద్‌లో పఠాన్స్‌ క్రికెట్‌ అకాడమీ