నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ లో పోలీస్ఎన్కౌంటర్మరణించిన రౌడీ షీటర్ రియాజ్కుటుంబీకులు సోమవారం రాష్ట్ర హ్యూమన్ రైట్స్కమిషన్ ను ఆశ్రయించారు. రియాజ్ తల్లితో పాటు అతని భార్యాపిల్లలు హెచ్ఆర్ సీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. మహిళలు, పిల్లలని చూడకుండా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, వేధింపులు, నిర్భంధం ఎదుర్కొంటున్నామని ఆరోపించారు.
రియాజ్‌ను ఎన్కౌంటర్ చేశాక తమను సిటీలోకి రానివ్వడంలేదని, ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని వాపోయారు. రియాజ్‌పై నమోదైన ఓ కేసులో కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్‌కు మధ్య ఆర్థిక పరమైన గొడవలు ఉన్నాయని చైర్మన్ కు వివరించారు. రియాజ్‌ను ఎన్కౌంటర్ చేసి తమ కుటుంబాన్ని దుర్భరంగా మార్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న హెచ్ ఆర్ సీ చైర్మన్ షమీమ్ అక్తర్ నవంబర్3లోపు నివేదిక ఇవ్వాలని డీజీపీ శివధర్‌రెడ్డిని ఆదేశించారు.
