GST ఎఫెక్ట్: రేట్లు తగ్గించిన రాయల్ ఎన్ఫీల్డ్.. బైక్ కొనేటోళ్లకు రూ.22వేలు సేవింగ్స్..

GST ఎఫెక్ట్: రేట్లు తగ్గించిన రాయల్ ఎన్ఫీల్డ్.. బైక్ కొనేటోళ్లకు రూ.22వేలు సేవింగ్స్..

Royal Enfield: జీఎస్టీ రేట్ల తగ్గింపుల ప్రకటన తర్వాత ఆటో రంగంలోని కార్ కంపెనీలతో పాటు ప్రస్తుతం టూవీలర్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులపై రేట్లను తగ్గిస్తున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి తగ్గే జీఎస్టీని కంపెనీలు నేరుగా తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. దీని ద్వారా ఈ సారి దీపావళి, దసరాకు అమ్మకాలను పెంచుకునే వ్యూహంతో కంపెనీలు ముందుగానే తగ్గింపుల గురించి ప్రకటనలు చేస్తున్నాయి. 

యూత్ ఎక్కువగా కొనుగోలు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ బెనిఫిట్స్ తమ కస్టమర్లకు పాసాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. తమ 350 సీసీ ఇంజిన్ కెపాసిటీ కలిగిన మోటార్ సైకిళ్లపై గతంలో జీఎస్టీ 28 శాతంతో పాటు 3 శాతం సెస్ కలుపుకుని మెుత్తం 31 శాతం పన్ను ఉండేదని.. కానీ ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్ రూల్స్ ప్రకారం 18 శాతం జీఎస్టీ వర్తిస్తున్నందున ఆ మేరకు 13 శాతం పన్ను తగ్గింపు బెనిఫిట్స్ నేరుగా కస్టమర్లకు అందించనున్నట్లు పేర్కొంది. 

కంపెనీ తీసుకున్న నిర్ణయం కారణంగా క్లాసిక్ 350, బుల్లెట్ 350, హంటర్ 350, మిటియర్ 350 మోడల్ బైక్స్ రేటు రూ.22వేలు తగ్గింది. వాస్తవానికి రాయల్ ఎన్ ఫీల్డ్స్ కంపెనీకి తన 350 సీసీ మోటార్ సైకిల్స్ వెన్నుముకగా ఉన్న సంగతి తెలిసిందే. ఇవి భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో ఎక్కువగా అమ్ముడుపోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. భారత ప్రభుత్వం ప్రస్తుతం తీసుకొస్తున్న జీఎస్టీ సంస్కరణల కారణంగా మెుదటి సారి బైక్ కొనుక్కునేవారు సంతోషంగా ఉన్నారు. ఈ తగ్గింపులు అమ్మకాలను పెంచుతాయని ఆటో రంగంలోని కంపెనీలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.