బ్రిటన్ ను అత్యధిక కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్ 2 ఇటీవలే తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం వెస్ట్ మినిస్టర్ హాల్ లో ఉంచిన క్వీన్ పార్థివ దేహం వద్ద ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఆమె శవపేటిక వద్ద విధులు నిర్వహిస్తున్న గార్డ్ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇదిలా ఉండగా క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలను సెప్టెంబర్ 19న ఉదయం చారిత్రక వెస్ట్ మినిస్టర్ అబేలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సందర్శనార్థం సెప్టెంబర్ 14నుంచి 4 రోజుల పాటు వెస్ట్ మినిస్టర్ హాల్ లో ఉంచనున్నారు. అందులో భాగంగా క్వీన్ పార్థివ దేహాన్ని ఆమె మృతి చెందిన బాల్మరోల్ కోట నుంచి రోడ్డు మార్గం మీదుగా ఎడింబరోలోని హోలీ రుడ్ హౌజ్ కోటకు తరలించారు. అక్కడ్నుంచి విమానంలో లండన్ కు తీసుకొచ్చారు.
ఈ క్రమంలోనే వెస్ట్ మినిస్టర్ హాల్లో క్వీన్ శవపేటికను కాటాఫాల్క్ అని పిలిచే ఓ ఎత్తైన వేదికపై ఉంచారు. అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న ప్రజలు రాణి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తు్న్నారు. ఈ సమయంలో ఎవరూ ఊహించని ఘటన జరిగింది. రాణి శవపేటిక వద్ద డ్యూటీలో ఉన్న ఓ రాయల్ గార్డ్ కింద పడిపోయాడు. అప్పటివరకూ బాగానే ఉండి, సడెన్ గా కుప్పకూలడంతో అక్కడున్న గార్డ్స్ వెంటనే తేరుకొని అతన్ని పక్కకు తీసుకొని వెళ్లారు. అయితే ఆ గార్డ్ నీరసంగా ఉన్నట్టు, అందుకే అలా పడిపోయినట్టు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A royal guard at Queen Elizabeth II's coffin collapses inside of the chapel. pic.twitter.com/JI1MyfdtkV
— Alex Salvi (@alexsalvinews) September 14, 2022
