ఆ క్షణంలో.. ఆ పోలీస్ హ్యాట్సాఫ్ : నిండు ప్రాణం కాపాడాడు

ఆ క్షణంలో.. ఆ పోలీస్ హ్యాట్సాఫ్ : నిండు ప్రాణం కాపాడాడు

కదులుతున్న రైలు ఎక్కుతూ ఎందరో ప్రయాణికులు జారిపడిన ఘటనలు చాలా ఉన్నాయి. స్టేషన్‌కి లేట్‌గా రావడం, రైలు కదిలి పోతుందన్న కంగారు...ఆ కంగారులో కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో ఎందరో జారిపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు కొందరైతే, కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుని వికలాంగులుగా మారుతున్న వారు కొందరు. మరి కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడుతున్న వారు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదం జరగకుండా  అక్కడున్న పోలీసులు రక్షిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్ర రాజధాని ముంబైలోని థానే రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో కిందపడ్డాడు .వెంటనే అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌,  ఆ ప్రయాణికుడిని రక్షించాడు.  దీంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు. ఈ సంఘటన రైల్వేస్టేషన్ లోని సీసీ టీవీలో రికార్డైంది.  


ప్లాట్‌ఫారమ్ నంబర్ 7 వద్ద ముంబై నుండి కళ్యాణ్ వెళ్తున్న సాకేత్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కేందుకు ప్రయాణీకుడు ప్రయత్నించాడు. అప్పటికే రైలు వేగంగా కదులుతుంది.  ఓ వ్యక్తి పరిగెత్తుకుంటే వచ్చి ట్రైన్ ఎక్కే క్రమంలో జారి కిందపడ్డాడు.  ఇక అంతే అక్కడున్న ఆర్ పీఎఫ్ కానిస్టేబుల్ సుమిత్ పాల్ అతనిని చూసి వెంటనే రక్షించాడు.  

2023  జనవరిలో  ఇలాంటి ఘటనే  బీహార్‌ లో చోటుచేసుకుంది.   ఒక వ్యక్తి కదులుతున్న రైలు  ఎక్కుతూ కిందపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  
 ఈ షాకింగ్ ఫుటేజిని  రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  బీహార్‌లోని పూర్నియాలో కదులుతున్న రైలులో ఎక్కుతుండగా ప్రమాదానికి గురైన ప్రయాణికుడిని అప్రమత్తమైన RPF జవాన్ రక్షించాడు. దయచేసి కదులుతున్న రైలులో ఎక్కేందుకు.. దిగేందుకు ప్రయత్నించవద్దు" అనే శీర్షిక ఉంది. 
ఈ వీడియోపై  నెటిజన్లు కామెంట్ చేశారు.   ఈ రకమైన ప్రమాదాలను నివారించవచ్చు ... సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు అని ఒకరు పోస్ట్ చేశారు. మరొకరు  స్టేషన్ నుండి రైలు బయలుదేరే ముందు తలుపులు మూయాలి..  మరియు స్టేషన్లలో ఆగిన తర్వాత తలుపులు తీయాలి  అని రాస్తూ... ఆటోమేటిక్ డోర్లు లేకుండా రైళ్లను నడుపుతూ ఉంటారు. పోలీస్ చేసిన పని  మంచి పనే కానీ.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా రైల్వేశాఖ పట్టించుకోకపోవడం దారుణమని రాశారు.   ఇంకొకరు  తరచుగా లాంటి సంఘటనలు జరుగుతున్నాయి.   ఏదో ఒక విధమైన శాశ్వత పరిష్కారాన్ని అమలు చేయాలని రాశారు.