రైల్వే పోలీస్ నోటిఫికేషన్ విడుదల 4,660 పోస్టుల ఫుల్ డిటేల్స్

రైల్వే పోలీస్ నోటిఫికేషన్ విడుదల 4,660 పోస్టుల ఫుల్ డిటేల్స్

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ లో సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ల ద్వారా 452 సబ్ ఇన్‌స్పెక్టర్-, 4,208 కానిస్టేబుల్- పోస్టులను భర్తీ చేయనున్నారు. కానిస్టేబుల్ పోస్ట్ కు గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 10వ తరగతి లేదా ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన వారు అర్హులు. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి. 

దరఖాస్తు తేదీలు

దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15న ప్రారంభమై  మే 14న ముగుస్తుంది. అధికారిక వెబ్ సైట్  rpf.indianrailways.gov.in లో అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు వివరాలు

జనరల్ అభ్యర్థులకు రూ.500లు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్, మహిళ, ట్రాన్స్‌జెండర్, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులు రూ. 250 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. కంప్యూటర్ ఆధారాత పరీక్ష(సీబీటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ), రూల్ ఆఫ్ రిసర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

వయోపరిమితి
జూలై 1, 2024 నాటికి కానిస్టేబుల్ అభ్యర్థులకు 18- నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 28 సంవత్సరాల వయసు ఉండాలి.