
ఐపీఎల్ 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్లో రెండు టాప్ టీమ్స్ తలపడుతున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్), జో రూట్, ధ్రువ జురెల్, హెట్‌మెయర్, అశ్విన్, బౌల్ట్, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్, చాహల్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు: జేసన్ రాయ్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్), రసెల్, రింకు సింగ్, నరైన్, శార్ధూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ఐపీఎల్ 2023లో కోల్కతా నైట్రైడర్స్ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లాడింది. ఇందులో ఐదు మ్యాచుల్లో గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. చివరిగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కతా విజయం సాధించింది. అటు రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచుల్లో ఆరింటిలో ఓడిపోయింది. ఐదింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. రాజస్థాన్ టీమ్ కూడా చివరిగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది.