యాక్టర్ టాప్‌‌ 10 ప్రిడిక్షన్ లిస్ట్‌‌లో ‘ఆర్ఆర్ఆర్’

యాక్టర్ టాప్‌‌ 10 ప్రిడిక్షన్ లిస్ట్‌‌లో ‘ఆర్ఆర్ఆర్’

జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ గురించి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రకరకాల సందర్భాల్లో చెప్పారు. రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత దేశవ్యాప్తంగా తన నటన గురించి జనం మాట్లాడుకున్నారు. ఇందులో కొమురం భీమ్ పాత్రలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు తారక్. ఇంటర్నేషనల్‌‌గానూ ఈ చిత్రం సత్తా చాటడంతో అంతర్జాతీయ స్థాయిలో తారక్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ‘ఆస్కార్‌‌‌‌ నామినేషన్స్‌‌లో ఎన్టీఆర్ నిలిచే అవకాశం ఉందంటూ ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ప్రిడిక్ట్ చేసింది.

ఆస్కార్ అవార్డుకు అర్హులైన కొందరు నటీనటులు, టెక్నీషియన్లను ఈ సంస్థ అంచనా వేస్తూ టాప్ టెన్‌ లిస్ట్ రెడీ చేసింది. బెస్ట్ యాక్టర్‌‌‌‌ కేటగిరిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకుగానూ ఎన్టీఆర్‌‌‌‌ పేరును చేర్చింది. విల్‌‌ స్మిత్, హ్యూ జాక్‌‌మన్ లాంటి హాలీవుడ్ స్టార్స్‌‌తో పాటు ఎన్టీఆర్‌‌‌‌కు చోటు దక్కడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఓ ఇండియన్ యాక్టర్ టాప్‌‌ 10 ప్రిడిక్షన్ లిస్ట్‌‌లో ఉండడంతో, ఇండియన్ సినీ లవర్స్‌‌ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన నటనకు ఆస్కార్ లభిస్తే.. వరల్డ్ సినిమా బెస్ట్ యాక్టర్స్‌‌లో ఒకడిగా చరిత్రకెక్కుతాడు ఎన్టీఆర్. మరోవైపు ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఆస్కారుకు నామినేట్ అయ్యే అవకాశం ఉందని టాప్‌‌ 10 డైరెక్టర్స్ లిస్టులో తన పేరును కూడా రాసింది ‘వెరైటీ’ మ్యాగజైన్. ఇదిలా ఉంటే  బెస్ట్ డైరెక్టర్‌‌‌‌గా న్యూయార్క్‌‌ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్‌‌ అవార్డును రీసెంట్‌‌గా జక్కన్న అందుకోవడం విశేషం.