
అందరు ఊహించునట్టుగానే 69వ జాతీయ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ హవా కొనసాగింది. ఈ సినిమా ఏకంగా 6 విభాగాల్లో అవార్డులు అందుకొని సత్తా చాటింది. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా.. ఆసారి జాతీయ అవార్డ్స్ లో దమ్ము చూపించింది.
ఈ సినిమాకు గాను.. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా కాల భైరవ, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా కీరవాణి, బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ గా కింగ్ సోలోమన్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్, బెస్ట్ స్పెషల్ ఎఫక్ట్ విభాగంలో శ్రీనివాస్ మోహన్ ను జాతీయ అవార్డులు దక్కాయి.
ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి మాసీ కాంబోలో దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ .. 2021 మార్చి 25 న రిలీజై భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.