
ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్‌ఆర్.. ప్రపంచ దేశాల్లో సత్తా చాటింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. హాలీవుడ్‌లో విశేషంగా భావించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులకు నామినేట్ అయిన ఆర్‌ఆర్‌ఆర్.. ఐదు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డులు దక్కాయి. బ్లాక్ పాంథర్, ది విమెన్ కింగ్, ది బ్యాట్ మ్యాన్ సినిమాలను వెనక్కి నెట్టి క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా హెచ్‌సీఏ స్పాట్‌లైట్ అవార్డును కూడా గెలిచి భారతీయ సినిమా ఖ్యాతిని మరింత పెంచింది.