ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా విడుదలయ్యేనా?

V6 Velugu Posted on Jan 21, 2022

హైదరాబాద్: సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ముందువరుసలో ఉంటుంది. ఇప్పటికే విడుదల అవ్వాల్సిన ఈ భారీ మూవీ.. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతికి ముందు జనవరి 7న రిలీజ్ అవుతుందని అనుకున్నప్పటికీ.. కరోనా కారణంగా మేకర్స్ వెనక్కి తగ్గారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ మేకర్స్ మరో రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దేశంలో కరోనా పరిస్థితులు చక్కబడి, థియేటర్లు పూర్తిగా తెరిస్తే.. మార్చి 18న చిత్రాన్ని విడుదల చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఏప్రిల్ 28న ఈ భారీ మల్టీ స్టారర్ ను బిగ్ స్క్రీన్స్ లో విడుదల చేస్తామని ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కాగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, సీనియర్ హీరో అజయ్ దేవగణ్, తమిళ నటుడు సముద్రఖనితో పాటు శ్రియా సరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి బాణీలు సమకూర్చిన ఈ చిత్రాన్ని.. డీవీవీ దానయ్య నిర్మించారు.

మరిన్ని వార్తల కోసం..

ఖమ్మంలో అధికారుల అత్యుత్సాహం: లోన్ కట్టలేదని రైతుల ఇళ్లకు తాళం

అప్పుల భారంతో మరో రైతు ఆత్మహత్య

ఈ ఐదు ఆత్మహత్యలు దొర ప్రేమకు నిదర్శనం

Tagged ram charan, Alia Bhatt, Release Date, RRR Movie, Rajamouli, Ajay Devgan, Tollywood, RRR Release Date, Junior NTR

Latest Videos

Subscribe Now

More News