ఆర్ఆర్ఆర్ మూవీ కొత్త పాట 26న రిలీజ్

ఆర్ఆర్ఆర్ మూవీ కొత్త పాట 26న రిలీజ్

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని జనవరి 7న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన దోస్తీ.. నాటు నాటు.. పాటలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మూవీపై మరింత క్రేజ్ పెంచేలా ఈనెల 26వ తేదీన 'జనని' అనే పాటను ఆర్‌ఆర్‌ఆర్‌ సోల్‌ ఆంథమ్‌గా రిలీజ్‌ చేస్తున్నట్లు  చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అజయ్‌ దేవగన్‌, రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు ఉన్న సాంగ్‌ పోస్టర్‌ను ఇవాళ విడుదల చేసింది.
ఇది వరకు విడుదలైన పాటలు ఒకదానికి మించి మరోటి హిట్‌ అయిన నేపథ్యంలో ఈనెల 26న రిలీజ్ కానున్న కొత్త పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాటు నాటు పాటకు ఇప్పటికీ మస్తు రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నాటు నాటు పాటకు సంబందించిన స్పూఫ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపధ్యంలో మూడో పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్ పై అజయ్ దేవగణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురూ చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. అంతేకాదు జెండాపై వందేమాతరం అని ఉండడంతో పాటలో సినిమా కథను.. వీరి సాహసాలను రెవీల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న అజయ్ దేవగణ్ కు సంబంధించిన యాక్షన్‌ పార్ట్‌ కూడా పాటలో ఉండే అవకాశమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.