జపాన్‌‌లో రిలీజ్‌కు‌ ‘ఆర్ఆర్ఆర్’ రెడీ

జపాన్‌‌లో రిలీజ్‌కు‌ ‘ఆర్ఆర్ఆర్’ రెడీ

ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగానే కాదు... ప్రపంచవ్యాప్తంగానూ ఫేమస్ అయ్యాడు రామ్ చరణ్. వరల్డ్ వైడ్‌‌గా ఇప్పటికే కొన్ని చోట్ల విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ ప్రతిచోటా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు జపాన్‌‌లో రిలీజ్‌‌కి రెడీ అయ్యింది. అక్టోబర్ 21న ఈ మూవీ జపాన్‌‌ భాషలో విడుదల కానుండటంతో ప్రమోషన్స్ కోసం తన భార్యతో అక్కడికి వెళ్లాడు చరణ్. మరోవైపు చరణ్ ప్రాజెక్ట్స్‌‌ విషయంలో ఇంటరెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన పదిహేనో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సగానికిపైగా షూటింగ్ పూర్తయింది. ఇందులో చెర్రీ డ్యూయెల్‌‌ రోల్‌‌ చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఎస్.జె.సూర్య విలన్‌‌గా కనిపించనున్నాడు. అయితే మరో ఇంపార్టెంట్‌‌ క్యారెక్టర్‌‌‌‌ని ఖుష్బూ పోషిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ‘అధికారి’ అనే టైటిల్ పెట్టనున్నారని కూడా వినబడుతోంది.

ఇదే కాదు.. దీని తర్వాత చరణ్ నటించబోయే సినిమాల గురించి కూడా బోలెడంత బజ్ నడుస్తోంది. అతని దర్శకుల లిస్టు రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్ కన్‌‌ఫర్మ్ అయ్యింది. ఆమధ్య లోకేష్ కనకరాజ్ పేరు కూడా వినిపించింది. తాజాగా ఈ లిస్టులోకి సుకుమార్ చేరాడు. శంకర్​ తర్వాత సుకుమార్‌‌‌‌తో ‘రంగస్థలం 2’ మొదలు పెట్టనున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక అల్లు అర్జున్‌‌, చరణ్ కాంబోలో ఓ సినిమా తీయాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నట్టు రీసెంట్‌‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అల్లు అరవింద్. పదేళ్ల క్రితమే ‘చరణ్–అర్జున్’ అనే టైటిల్‌‌ని కూడా రిజిస్టర్ చేశారట. ఇప్పటికీ దాన్ని రెన్యువల్ చేస్తూనే ఉన్నానన్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ కూడా లైన్‌‌లో ఉన్నట్టే. మరి ఈ వార్తల్లో ఏవేవి ఫ్యూచర్‌‌‌‌లో నిజమవుతాయో చూడాలి.