రివోల్ట్ ఆఫ్ భీమ్

రివోల్ట్ ఆఫ్ భీమ్

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌’ సినిమా జనవరి 7న రిలీజవుతోంది. ఎన్టీఆర్, రామ్‌‌చరణ్‌‌లతో కలిసి దేశమంతా తిరుగుతూ మూవీని ఓ రేంజ్‌‌లో ప్రమోట్‌‌ చేస్తున్నారు రాజమౌళి. మరోవైపు సోషల్‌‌ మీడియాలోనూ అప్‌‌డేట్స్ రిలీజ్ చేస్తూ అంచనాలను మరింత పెంచేస్తున్నారు. నిన్న ‘రివోల్ట్ ఆఫ్ భీమ్’ పేరుతో ఓ పాటను వదిలారు. ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందో తెలిపే  పాట ఇది. బాధ, కోపం, ఆవేశం వంటి అన్ని రకాల ఎమోషన్స్‌‌ ప్రదర్శిస్తూ ఇంటెన్స్ లుక్‌‌లో కనిపించి ఇంప్రెస్ చేశాడు తారక్. కీరవాణి క్యాచీ ట్యూన్‌‌కి సుద్దాల అశోక్ తేజ్ రాసిన లిరిక్స్ ఇన్‌‌స్పైరింగ్‌‌గా ఉన్నాయి. ‘భీమా నిను గన్న నేలతల్లి.. ఊపిరి పోసిన సెట్టుసేమ.. పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతున్రు. ఇనబడుతుందా’ అంటూ ఎన్టీఆర్ వాయిస్‌‌తో స్టార్ట్ అయింది పాట. ‘కొమురం భీముడో కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. కొమురం భీముడో కొమురం భీముడో రగరగ సూరీడై రగలాలి కొడుకో’ అంటూ ఆవేశంగా పాడాడు కీరవాణి కొడుకు కాలభైరవ. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ తనే పాడడం విశేషం. వీడియోలో ఎన్టీఆర్‌‌‌‌తో పాటు  కనిపించి మెప్పించాడు కూడా. ఓవరాల్‌‌గా పాట వినడానికి, చూడటానికి కూడా అద్భుతంగా ఉంది.  సినిమా స్థాయిని మరోసారి గుర్తు చేసింది.