
హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ సినిమా #RRR(పేరు ప్రకటించలేదు) పై దేశమంతటా ఆసక్తి ఉంది. బాహుబలి సీక్వెల్ తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో… సినిమా అభిమానులందరూ ఈ సినిమా అప్ డేట్స్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పలు షూటింగ్ షెడ్యూల్స్ ఇటీవలే పూర్తయ్యాయి. ఈ మూవీకి పెట్టే పేరు గానీ.. మిగతా తారాగణం వివరాలు.. హీరోయిన్లు.. రిలీజ్ డేట్ లాంటివేవీ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇవాళ హైదరాబాద్ లో #RRR ప్రెస్ మీట్ పెడుతోంది.
#RRR సంబంధించిన వివరాలను దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించబోతున్నారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారు ఈ నలుగురు.