జపాన్ పర్యటనను ఎంజాయ్ చేసిన తారక్, చరణ్

జపాన్ పర్యటనను ఎంజాయ్ చేసిన తారక్, చరణ్

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీలు అక్కడ సందడిగా గడిపాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో దర్శకుడు రాజమౌళి కూడా ఉన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న వారి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ రోడ్డుపై ఎన్టీఆర్, చరణ్ దంపతులు రోజా పూలను చేతిలో పట్టుకుని రోడ్డు దాటుతున్న వీడియో, ఫొటోలను ఆప్ లోడ్ చేశారు. వీటిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ తో కేక పుట్టిస్తున్నారు. 

ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల కథను ఆధారంగా తీసుకుని ప్రముఖ దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కించారు. అల్లూరి సీతారామరాజు పాత్రను ‘రాం చరణ్’ పోషించగా.. కొమురం భీం రోల్ ను జూనియర్ ఎన్టీఆర్ పోషించారు. ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఈ మూవీలో అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ కీలక పాత్రలు పోషించారు. ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు వెర్షన్ ని జపనీస్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేశారు. జపాన్ లో ఈనెల 21న భారీ స్థాయిలో సినిమా విడుదలైంది.