
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ విదేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఈ సినిమా తాజాగా మరో 2 ఖాతాలో వేసుకుంది. హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డుల్లో ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది.
అంతేకాదు, ఈ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారం కూడా ఈ చిత్రానికే దక్కింది. ఇప్పటికే ఆస్కార్ బరిలో ఉన్న నాటు నాటు పాట హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీని కూడా ఆకట్టుకుంది. ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్న ఆర్ఆర్ఆర్... ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులోనూ నిలిచింది. హీరోలు జూ.ఎన్టీఆర్,రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ ఖాయమని చిత్రబృందంతో పాటు సినీ ప్రేక్షులు ధీమాతో ఉన్నారు.