RRR Golden glob awards: అమెరికాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి

RRR Golden glob awards: అమెరికాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి

ప్రపంచ సినిమా వేదికపై ఆర్ఆర్ఆర్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. అన్ని దేశాల్లో సత్తా చాటుతూ, అభిమానుల్ని సంపాదించుకుంటోంది. ఈ సినిమా ఇప్పుడు మరొక మైలురాయి చేరుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ లో ఆర్ఆర్ఆర్ సినిమా రెండు కేటగిరీల్లో నామినేట్ అయింది. ఇవాళ సాయంత్రం అమెరికాలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.  

బెస్ట్ పిక్చర్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట నామినేట్ అయ్యాయి. ఈ రెండు కేటగిరీల్లో ఏదో ఒక దాంట్లో ఆర్ఆర్ఆర్ కు అవార్డ్ దక్కుతుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు డైరెక్టర్ రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ అమెరికా వెళ్లారు. ఈ వార్త వినగానే లాస్ఏంజిల్స్ లోని ఎన్టీఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఎల్ ఈడీ ట్రక్కులు ఏర్పాటుచేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.