ఒక్క విద్యార్థి చనిపోయినా రూ.కోటి పరిహారం ఇవ్వాలి

ఒక్క విద్యార్థి చనిపోయినా రూ.కోటి పరిహారం ఇవ్వాలి
  • ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్న ఏపీకి సుప్రీంకోర్టు హెచ్చరిక
     

న్యూఢిల్లీ: తమ రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకే కట్టుబడి ఉన్నామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక్క విద్యార్థి చనిపోయినా కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశాలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 10,12 తరగతుల పరీక్షలు నిర్వహణపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షలు జరిపి తీరుతామంటున్న ఏపీ ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని లక్షల మందికి గదికి 15 వేల మందితో పరీక్షలు జరిపిస్తామంటే టెన్త్, ఇంటర్ పరీక్షలకు 28 వేలు, 34 వేల గదులు అవసరం అవుతాయని తెలుస్తోందని.. మరి పరీక్షల నిర్వహణకు అన్ని గదులు అందుబాటులో ఉన్నాయా..? ఇవేవీ మీ అఫిడవిట్ లో లేవే అని సుప్రీంకోర్టు ప్రవ్నించింది. పరీక్షలకు 15 రోజుల ముందు షెడ్యూల్ ఇస్తామంటున్నారు.. ఇప్పుడు అంత సమయం ఎక్కడుంది..? ప్రణాళికలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. వేల గదులకు లక్షల మంది సిబ్బంది అవసరం అవుతారు.. అంత సిబ్బంది మీకు అందుబాటులో ఉన్నారా ? లక్షల మంది విద్యార్థులను తీసుకొచ్చి కరోనా వేళ ఒక్కో  గదిలో 15 మందిని ఎలా కూర్చోబెడతారు.. ? లక్షల సంఖ్యలో  సిబ్బందిని విద్యార్థులను ఎలా సమన్వయం చేసుకోగలుగుతారు.. పరీక్షల సందర్భంగా మళ్లీ కరోనా వస్తే ఎలా.. ? రెండో దశలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో చూశాం కదా.. పరీక్షల తర్వాత కూడా జవాబు పత్రాలను దిద్దడం... ఇదంతా చాలా ప్రక్రియ ఉంది.. ఇవేవీ మీ అఫిడవిట్ లో కనిపించడం లేదు.. ఏదో నిర్ణయం తీసుకున్నామని.. కట్టుబడి ఉంటామంటే ఎలా.. పరిస్థితి మీకు అర్ధం కావడం లేదా..? కరోనా తీవ్రతలో పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తుంటే మీకు కనిపించడం లేదా.. అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. నిర్ణయం ఏదైనా భావితరాలకు ఉపయోగపడేరీతిలో ఉండాలే కాని.. ప్రణాళిక లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు.. గ్రేడ్లను మార్కులుగా మార్చడం కష్టమే కావచ్చు..  అవసరమైతే యూజీసీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల సలహాలు తీసుకోవచ్చు కదా..అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. 
నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని పాతపాటే పాడితే.. లక్షల మంది ప్రాణాలతో చెలగాట మాడుతున్నారనే విషయం మరచిపోవద్దని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షల నిర్వహణ సందర్భంగా లేదా.. ఆ తరవాతైనా ఏ ఒక్క విద్యార్థి మరణించినా ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా  ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మొండి వైఖరితో పరీక్షలు నిర్వహిస్తున్నామంటున్నారే తప్ప.. మీలో చిత్తశుద్ధి కనిపించడంలేదని సుప్రీంకోర్టు  బెంచ్‌ న్యాయమూర్తులు జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఖన్విలేకర్ ధర్మాసనం   వ్యాఖ్యానించింది. పరీక్షల సందర్భంగా ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా.. కొంత సమయం ఇస్తే ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తెలియజేస్తామని ఏపీ ప్రభుతవ న్యాయవాది నజ్కి తెలిపారు. అయితే దీనికి సుప్రీం కోర్టు నిరాకరించింది. విద్యార్థులను గందరగోళానికి గురిచేసే అంశమని.. అంత సమయం ఇవ్వమని.. దీనిపై రేపే విచారణ జరుపుతామని.. రేపు విచారణకు వచ్చేటప్పులు పూర్తి వివరాలు అందించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. విచారణ  రేపటికి వాయిదా వేసింది.