
Nippon India Mid Cap Fund : డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఇది పెట్టుబడులకు కూడా వర్తిస్తుంది. అయితే సరైన పద్ధతిలో పెట్టుబడులను క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు కొనసాగించే వారికే డబ్బులు వస్తాయని చాలా మంది పెద్ద ఇన్వెస్టర్లు చెప్పే మాటను మరోసారి రుజువు చేసింది నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్.
మ్యూచువల్ ఫండ్ రంగంలో ఒక ముఖ్య ఘట్టం నమోదైంది. నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్‌క్యాప్ ఫండ్ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1995 అక్టోబర్ 8న ప్రారంభమైన ఈ ఫండ్.. ప్రారంభించిన నాటి నుంచి 22.33% సగటు వార్షిక వృద్ధిని ఇన్వెస్టర్లకు అందించింది.
ఎవరైనా ఇన్వెస్టర్ ఫండ్ స్టార్ట్ చేసినప్పుడే ఒకేసారి అందులో రూ.లక్ష పెట్టుబడి పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే ఆ పెట్టుబడి విలువ ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం.. రూ.4 కోట్లుగా మారింది. ఈ ఫండ్ లో ప్రతినెల నెల రూ.వెయ్యి SIPగా పెట్టుబడి చేసినవారి పెట్టుబడి విలువ ఇప్పుడు రూ.2.25 కోట్లు కాగా..10 సంవత్సరాలపాటు నెలకు ఇందులో రూ.10వేలు SIP పెట్టుబడి చేసినవారికి ఫండ్ రూ.36.9 లక్షల రాబడిని అందించింది. ఇక్కడ ఎంత త్వరగా పెట్టుబడిని స్టార్ట్ చేసి ఎంత ఎక్కువ కాలం దానిని హోల్డ్ చేస్తున్నాం అన్నదానిపైనే రాబడి ఆధారపడి ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.
Also Read : AI కోసం ఉద్యోగుల హెల్త్ డేటా ఇవ్వాలని ఒత్తిడి
సుమారు రూ.38వేల 400 కోట్ల ఆస్తులను నిర్వహిస్తున్న ఈ ఫండ్.. దేశంలోనే అతిపెద్ద, పాత మిడ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. బలమైన ఫండమెంటల్స్, అధిక ఆదాయ వృద్ధి సామర్థ్యం ఉన్న మధ్యతరహా కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం దీని ముఖ్య పెట్టుబడి వ్యూహం. CRISIL ర్యాంకింగ్స్‌లో కూడా వరుసగా మూడు త్రైమాసికాలపాటు మిడ్‌క్యాప్ విభాగంలో టాప్ 30 శాతంలో నిలిచింది. ఈ ఫండ్ ఫైనాన్షియల్ సెక్టార్ లో 25%, కన్జ్యూమర్ డిస్క్రిషనరీ అండ్ ఇండస్ట్రియల్ రంగాల్లో చెరో 17% పెట్టుబడులను కలిగి ఉంది. అలాగే హెల్త్‌కేర్, టెక్నాలజీ, ఎనర్జీ, మెటీరియల్స్ రంగాల్లో కూడా డబ్బును పెట్టుబడిగా పెట్టింది ఫండ్. సెప్టెంబర్ నాటికి ఫండ్ నెట్ అసెట్ వ్యాల్యూ యూనిట్ రేటు రూ.2వేలకు చేరుకోవటంతో కాంపౌండింగ్ శక్తి మరోసారి నిరూపించబడింది.