జవహర్​నగర్ ​డంపింగ్ యార్డ్ మృతుల కుటుంబాలకు..రూ.15 లక్షల చొప్పున పరిహారం

జవహర్​నగర్ ​డంపింగ్ యార్డ్ మృతుల కుటుంబాలకు..రూ.15 లక్షల చొప్పున పరిహారం

హైదరాబాద్ సిటీ, వెలుగు: జవహర్​నగర్ డంపింగ్ యార్డులోని రాంకీ పవర్​ప్రాజెక్టు పనుల్లో లిఫ్ట్​తెగిపడి చనిపోయిన ముగ్గురు కార్మికులకు జీహెచ్ఎంసీ మేయర్​గద్వాల్ విజయ లక్ష్మి రూ.15 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె శానిటేషన్ ఆఫీసర్లు, రాంకీ ప్రాజెక్ట్​యాజమాన్యంతో సమావేశమయ్యారు. పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్ట్​నిబంధనల ప్రకారం ఒక్కో బాధిత కుటుంబానికి రూ.15 లక్షలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.4 లక్షలు మంజూరు చేశామన్నారు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, రాంకీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అగర్వాల్ పాల్గొన్నారు. అయితే రాంకీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే లిఫ్ట్​కూలిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.