బెస్ట్ ఆఫర్: రూ. 17వేల 5G స్మార్ట్ ఫోన్ 10 వేలకే

బెస్ట్ ఆఫర్: రూ. 17వేల 5G స్మార్ట్ ఫోన్ 10 వేలకే

తక్కువ ధరలో మంచి బ్రాండ్ ఫోన్లను కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. పెద్ద బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్.. మీ బడ్జెట్లో ఫోను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్ కార్ట్లో అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. Poco M6Pro 5G  స్మార్ట్ఫోన్ చాలా తక్కువ ధరకు లభిస్తుంది.ఫ్లిప్కార్ట్లో ఈ ఫొకోఫోన్ను రూ. 9,999 కొనుగోలు చేయొచ్చు. దీని ఒరిజినల్ ధర రూ. 16,999 లు. ఈ ఫోన్ 6GB RAM, 128 GB స్టోరేజ్తో వస్తుంది. ఈ ఫోన్  ప్రీమియం గ్లాస్ డిజైన్ కలిగి ఉన్న ఈ ఫోన్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Poco M6 Pro 5G  ఫీచర్ల గురించి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో 6.79 అంగుళాల FHD+ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ ప్లే గొరిల్లా గ్లాస్ 3 పొరను కూడా కలిగి ఉంటుంది. Poco ఈ కొత్త స్మార్ట్ ఫోన్ Androind 13 ఆధారిత MIUI14 పై రన్ అవుతుంది. ఇది Qualcomm Snapdroagon 4 Gen 2  ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఇందులో 3 సంవల్సరాల సెక్యూరిటీ అప్ డేట్ లతో పాటు 2 ప్రధాన OS అప్ డేట్ లను కూడా పొందవచ్చు. 

ALSO READ :- ఓడినోళ్లకు వంగివంగి దండాలు పెడ్తారా?..మీ వెన్నుపూస సరి చేస్తా: ఎమ్మెల్యే సంజయ్

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఈ పొకో ఫోన్ లో 50 మెగా పిక్సెల్ ప్రైమరి కెమెరా , బ్యాక్ లో 2 మెగా పిక్సెల్ డెప్ల్ సెన్సార్, సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 

 పవర్ పుల్ బ్యాటరీ 

ఈ ఫోన్ లో 5000  mAh బ్యాటరీ ఉంది. దీనికి 18W ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ లో కనెక్టివిటీ కోసం USB టైప -C పోర్ట్ ఉంటుంది. Poco M6 Pro 5G లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంట్ ఉంటుంది.