గద్వాల, వెలుగు : గద్వాల టౌన్ అభివృద్ధికి రూ.18.70 కోట్లు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం ఈ నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.
గద్వాల మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సీసీ డ్రైనేజీ కోసం రూ.4.75 కోట్లు, సీసీ రోడ్ల కోసం 1.80 కోట్లు, బీటీ రోడ్ల పనుల కోసం రూ.6 కోట్లు, చింతలపేట ప్రధాన రహదారి వెడల్పు కోసం రూ.2.30 కోట్లు, బాలరక్షాబంధన్ దగ్గర పైప్ కల్వర్టు నిర్మాణం, ఎస్ డబ్ల్యూడీ నిర్మాణం, మేళ్లచెరువు ఎక్స్ రోడ్డు నుంచి స్మార్ట్ వాటర్ డ్రైనేజీ కోసం రూ.1.50 కోట్లు నిధులు మంజూరైనట్లు వివరించారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన మంత్రులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
