రూ. 1.93 కోట్ల విలువైన గంజాయి కాల్చేసిన్రు

రూ. 1.93 కోట్ల విలువైన గంజాయి కాల్చేసిన్రు

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ జిల్లా వ్యాప్తంగా పట్టుకున్న గంజాయిని శనివారం ఎస్పీ చందనాదీప్తి కాల్చేశారు. ఇటీవలి కాలంలో వివిధ పోలీస్‌‌ స్టేషన్ల పరిధిలో 26 కేసుల్లో 1,379 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీనిని కోర్టు ఉత్తర్వుల మేరకు ఎస్పీ, డ్రగ్‌‌ డిస్పోజల్‌‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నార్కట్‌‌పల్లి మండలం గుమ్మలబావి పోలీస్‌‌ ఫైరింగ్‌‌ రేంజ్‌‌ వద్ద కాల్చి వేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణా చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌ ఎస్పీ రాములు నాయక్‌‌, ఎస్‌‌బీ డీఎస్పీ రమేశ్‌‌, నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, డీసీఆర్‌‌బీ డీఏస్పీ సైదా, సీఐలు రాఘవరావు, బీసన్న, సైదులు, నాగరాజు పాల్గొన్నారు.