ఫ్రీ కరెంట్‌‌కు 198 కోట్లు.. రైతు బీమాకు 800 కోట్లు

ఫ్రీ కరెంట్‌‌కు 198 కోట్లు.. రైతు బీమాకు 800 కోట్లు

రజకులు, నాయీబ్రాహ్మణుల ఫ్రీ కరెంట్‌‌కు 198 కోట్లు రిలీజ్‌‌

హైదరాబాద్, వెలుగు: సెలూన్స్‌‌, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఫ్రీ కరెంట్‌‌ అందజేసేందుకు ప్రభుత్వం రూ. 198 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ రాహుల్‌‌ బొజ్జా శనివారం జీవో జారీ చేశారు. నాయీ బ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌‌ స్కీం అమలుకు సంబంధించి ఏప్రిల్‌‌4వ తేదీనే జీవో జారీ చేశారు. అదే తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు అది అమలు కాకపోగా.. ప్రస్తుతం నిధులు రిలీజ్​చేస్తూ జీవో ఇచ్చారు.

రైతు బీమా స్కీంకు 800 కోట్లు రిలీజ్: మంత్రి హరీశ్ రావు ట్వీట్ 
రైతు బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 800 కోట్ల నిధులను రిలీజ్ చేసిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. 2021–22 సంవత్సరానికి ఈ నిధులు రిలీజ్ అయ్యాయని పేర్కొంటూ ఆయన శనివారం రాత్రి ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ కు రైతుల సంక్షేమమే టాప్ ప్రయారిటీ అని మంత్రి పేర్కొన్నారు.