కిలో మిడతలు పట్టి తెస్తే రూ.20

కిలో మిడతలు పట్టి తెస్తే రూ.20

మిడతలు పట్టితెండి.. పైసలు తీసుకుపొండి: పాక్

మిడతల దండు సమస్యకు పాకిస్తాన్ సూపర్  సొల్యూషన్ ను కనిపెట్టింది. పురుగు మందులు, స్ప్రేలు, జెట్టింగ్ మిషన్ల ఖర్చులేకుండా సమస్యను  పరిష్కరించేందుకు మంచి ఐడియా చేసింది. “క్యాచ్ లోకస్ట్స్, ఎర్న్ మనీ, సేవ్ క్రాప్స్” పేరుతో పైలట్ ప్రాజెక్ట్  చేపట్టింది. మిడతలను పారదోలే బాధ్యత జనంపై పెట్టి, వారికి దీనిని ఉపాధి మార్గంగా మార్చింది. కిలో మిడతలు పట్టి తెస్తే రూ.20 ఇస్తామని ప్రకటించింది. పైలట్ ప్రాజెక్ట్ గా ఓకరా జిల్లాలో దీన్ని మొదలుపెట్టింది. మొదటి రోజు పెద్దగా జనంరాలేదు. కానీ తర్వాతి రోజు నుంచి వందలాది మంది మిడతలను పట్టడం మొదలెట్టారు. ఒక్క రాత్రిలోనే దాదాపు 7 టన్నుల మిడతలను పట్టడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.

కోళ్లకు ఇది హై  ప్రొటీన్

ప్రభుత్వం కొన్న మిడతలను ఏం చేస్తుందనే కదా మీ డౌట్? వాటికి ఫుల్ గిరాకీ ఉంది. కోళ్లకు, చేపలకు వేసే దాణా కన్నా మిడతలతో చేసిన దాణా లో హై ప్రోటీన్ ఉంటుందంట. పాక్ లోని ఓ బడా పౌల్ట్రీ ఫీడ్స్ కంపెనీ 5 వారాల పాటు స్టడీ చేసి ఈ విషయాన్ని తెలిపింది.

For More News..

పల్లెల్లో శానిటేషన్ డ్రైవ్

ఇవి ఎడారి మిడతలు కావు.. పక్కా లోకల్​

గ్లోబల్‌‌‌‌ లీడర్‌‌‌‌ దారిలో ఇండియా