అలీబాబాకు రూ. 21 వేల కోట్ల ఫైన్‌‌‌‌!

అలీబాబాకు రూ. 21 వేల కోట్ల ఫైన్‌‌‌‌!

న్యూఢిల్లీ: ఆన్​లైన్​ షాపింగ్​ కంపెనీ అలీబాబా పై చైనీస్‌‌‌‌ ప్రభుత్వం రూ. 21 వేల కోట్ల( 2.8 బిలియన్‌‌‌‌ డాలర్లు) ఫైన్‌‌‌‌ వేసింది. ‘యాంటి కాంపిటీటివ్‌‌‌‌’ రూల్స్‌‌‌‌లో భాగంగా ఈ డబ్బులు కట్టాలని ఆదేశించింది. కంపెనీకి ఉన్న పొజిషన్‌‌‌‌ను వాడుకొని, కాంపిటేటర్లు లేకుండా అలిబాబా చేస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. చైనీస్ ప్రభుత్వం అక్కడి టెక్, ఫైనాన్షియల్ కంపెనీలపై గత కొంత కాలం నుంచి స్క్రూటినీ పెంచింది.  టెన్సంట్ హోల్డింగ్స్‌‌‌‌ను కలుపుకొని మొత్తం 12 కంపెనీలపై ఈ ఏడాది మార్చిలో రూ. 57 లక్షల చొప్పున ఫైన్ వేసింది.  ఈ కంపెనీలు డీల్స్‌‌‌‌ను బయటపెట్టడంలో ఫెయిలయ్యాయని ఆరోపించింది.