
శంషాబాద్, వెలుగు: ఒకడు బెల్టు బకిల్‌లో పెట్టుకుతీసుకొస్తడు. ఇంకొకడు బ్యాగు కొక్కెంలల్ల పెట్టి తెస్తడు. మరొకడు ఇనుప కడ్డీల్లా తరలిస్తడు. ఇవీ ఈ మధ్య గోల్డ్ స్మగ్లింగ్ కేటుగాళ్లు పాటిస్తున్న కొత్త కొత్త పద్ధతులు. ఎట్ల తీసుకొచ్చినా దొరికిపోతుండడంతో ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తున్నరు. తాజాగా ఇస్త్రీ పెట్టెలనూ వదల్లేదు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి, 9.5 కిలోల బంగారాన్ని నాలుగు ఇస్త్రీ పెట్టెల్లో పెట్టుకొచ్చిండు. వీ ఆకారంల హీటింగ్ కాయిల్స్లా పేర్చాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు మాత్రం ఊరుకుంటరా? అడ్డంగా బుక్ చేసేసిన్రు. చెక్‌చేసి ఇస్త్రీపెట్టెల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నరు. ఆ బంగారం విలువ 3 కోట్ల 46 లక్షల 48 వేల 96 రూపాయలుంటుందని అధికారులు చెబుతున్నరు.