ఒక్కో ద్రాక్ష పండు రూ.35,000.. ఎందుకు అంత రేటు?

ఒక్కో ద్రాక్ష పండు రూ.35,000.. ఎందుకు అంత రేటు?

ఈ గ్రేప్స్​ మస్త్‌‌ కాస్ట్‌‌లీ!

ద్రాక్ష.. రేట్‌‌ ఎంత ఉంటుంది? మహా అయితే కేజీ వంద రూపాయలు. వెరైటీ అయితే యాభై రూపాయలు అదనం. కానీ, జపాన్‌‌లో దొరికే ఈ గ్రేప్స్‌‌ మాత్రం అట్ల కాదు. ఒక బంచ్‌‌ ద్రాక్షల రేటు లక్షల్లో ఉంటుందట. అదే ఒక్క పండు కొనాలంటే 35వేల రూపాయలు. రూబీ రోమన్‌‌ గ్రేప్స్‌‌ పేరుతో పిలిచే ఇవి జపాన్‌‌లో మాత్రమే దొరుకుతాయి. అది కూడా  ఇషికావా అనే ప్లేస్‌‌లోనే. ఈ గ్రేప్స్‌‌ బంచ్​తో అన్ని పండ్లు ఒకే రంగు, ఒకే సైజ్‌‌లో ఉంటాయట. రుచి సూపర్‌‌‌‌‌‌ ఉంటుందట. అందుకే ఏడాదికి ఒకసారి మాత్రమే దొరికే ఈ ద్రాక్షల కోసం జపాన్‌‌ జనం ఎగబడుతుంటారని వ్యాపారులు చెబుతున్నారు. వీటిని ఎక్కడపడితే అక్కడ, ఎవరు పడితే వాళ్లు అమ్మడానికి  కూడా లేదు. ఇషికావా అడ్మినిస్ట్రేషన్‌‌ ఇచ్చే రూల్స్‌‌ ప్రకారమే వాటిని అమ్మాలి. అంతేకాకుండా క్వాలిటీ చెక్‌‌ చేసి, స్టిక్కర్‌‌‌‌ వేసినవి మాత్రమే కొనాలి.  ఈ ద్రాక్షకు 2020 సంవత్సరంలో వేలంపాట పెడితే ఒక ద్రాక్ష బంచ్​ను సుమారు 400 డాలర్లకు కొన్నారట. అంటే మన కరెన్సీలో ఒక్కో బంచ్‌‌ 7,50,000 రూపాయలు కాగా.. ఒక్కో ద్రాక్ష పండు రూ.35,000 అన్నమాట. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ పంట చేతికొస్తుంది. కేవలం 24 వేల గుత్తులు మాత్రమే కాస్తాయట. 

For More News..

త్వరలో కరెంటు, ఆర్టీసీ చార్జీల పెంపు?

ప్రతిపక్షాల ఒంటరి పోరుతో బీజేపీకే ఫాయిదా