పెద్దపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రినోవేషన్ పనులు స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పెద్దపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రినోవేషన్ పనులు స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •  అమృత్​ భారత్​ స్కీం కింద రూ.37కోట్లు కేటాయింపు 
  •  రైల్వే అధికారుల వరుస పర్యటనలతో పనుల్లో వేగం 
  •  పెద్దపల్లితోపాటు మొదలైన కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రామగుండం పనులు ఇప్పటికే పూర్తి 
  •   పనుల్లో జాప్యంపై ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం 

పెద్దపల్లి, వెలుగు: ఏడాది కింద మొదలైన పెద్దపల్లి రైల్వే స్టేషన్​రినోవేషన్​పనులు స్పీడందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమృత్​ భారత్​ స్కీం కింద పెద్దపల్లి రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధునీకరణకు రూ. 37 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించి గతేడాది ఫిబ్రవరి 26న ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనులు ప్రారంభించారు.  అయితే ఏడాదయినా ఆశించిన స్థాయిలో పనులు పూర్తికాలేదు. పెద్దపల్లి రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు రామగుండం, మంచిర్యాల, కరీంనగర్​ స్టేషన్లలో కూడా అమృత్​ భారత్ కింద​ పనులు స్టార్ట్​ చేశారు. అందులో కరీంనగర్​, రామగుండం పూర్తయ్యాయి. మంచిర్యాల స్టేషన్​ కూడా పనులు పూర్తి కావస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో పెద్దపల్లి రైల్వేస్టేషన్​ పనుల్లో జాప్యం జరిగింది. 

ఏడాది కింద మొదలైన పనులు 

అమృత్​ భారత్​కింద రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా పెద్దపల్లి రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గతేడాది అధికారులు కూల్చేశారు. మొదటగా రూ. 27 కోట్లు మంజూరు చేయగా.. నిర్మాణ వ్యయం పెరగడంతో రూ. 37 కోట్లు శాంక్షన్​ చేశారు. ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే స్టేషన్​ పనులను పరిశీలించారు. పనుల్లో జాప్యంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైల్వే అధికారులు పనులనే వేగవంతం చేశారు.  నాలుగు రోజుల కింద సౌత్​ సెంట్రల్​ రైల్వే జీఎం సందీప్​మాథూర్​పర్యటించి పనులను స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారుల వరుస పర్యటనలతో పనుల్లో వేగం పెరిగింది. 

అవస్థలు పడుతున్న ప్రయాణికులు 

పెద్దపల్లి రైల్వేస్టేషన్​ భవనాలను పూర్తిగా కూల్చేయడంతో ఏడాదిగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్లు, రెస్ట్​ రూంలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. తాగునీరు, ఆహార పదార్థాల కోసం స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బయటకు రావాల్సి వస్తోంది.