జూబ్లీహిల్స్‌‌లో ఇల్లు కోసం రూ.41 కోట్లు

జూబ్లీహిల్స్‌‌లో ఇల్లు కోసం రూ.41 కోట్లు
  • జనవరిలో కొన్న విర్కో ఓనర్‌ ఎన్‌ వెంకట రెడ్డి
  • రూ. 10 కోట్లకు పైనున్న ప్రాపర్టీ డీల్స్ పెరిగాయి

హైదరాబాద్‌‌, వెలుగు: ఫార్మా కంపెనీ విర్కో లేబొరేటరీస్‌‌ ఓనర్ ఎన్‌‌. వెంకట రెడ్డి హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్‌‌లో ఏకంగా రూ. 41.3 కోట్లు పెట్టి ఒక ఇండిపెండెంట్‌‌ హౌస్‌‌ను కొన్నారు. జాప్కీ.కామ్‌‌ డేటా ప్రకారం ఈ ఇల్లు 1,837 చదరపు యార్డ్‌‌లు లేదా 1,537 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. స్టాంప్‌‌ డ్యూటీ కి రూ. 2.27 కోట్లను, రిజిస్ట్రేషన్‌‌ ఫీజు కింద రూ. 20 లక్షలను వెంకట రెడ్డి చెల్లించారు.  ఈ ప్రాపర్టీ గత నెల 28న రిజిస్టర్‌‌‌‌ అయ్యిందని జాప్కీ పేర్కొంది. జూబ్లీహిల్స్‌‌లో ఇదే అతిపెద్ద రెసిడెన్షియల్ డీల్‌‌ అని తెలిపింది.

రూ. 10 కోట్ల పైన డీల్స్ పెరుగుతున్నాయ్‌‌

జూబ్లీహిల్స్‌‌ ఏరియాలో రూ. 10 కోట్ల కంటే పైనున్న ప్రాపర్టీ డీల్స్‌‌ పెరుగుతున్నాయని జాప్కీ.కామ్‌‌ తెలిపింది. జనవరి 21, 2021 న రూ. 10 కోట్ల విలువైన మరొక ప్రాపర్టీ డీల్‌‌ క్లోజయ్యింది. ఈ ఇండిపెండెంట్ హౌస్‌‌ను ఆర్వేన్సిస్‌‌ ఎనర్జీ డైరక్టర్‌‌‌‌ అర్నిపల్లి హరీశ్​ కుమార్‌‌‌‌ కొన్నారని జాప్కీ పేర్కొంది. గత ఐదేళ్లలో జూబ్లీహిల్స్‌‌ ఏరియాలో  రూ. 10 కోట్లకు పైనున్న 120  సేల్ ట్రాన్సాక్షన్లు జరిగాయని తెలిపింది. కిందటేడాది ఇలాంటి ట్రాన్సాక్షన్లు 17 జరిగాయి. పొలిటీషియన్స్‌‌, ఇండస్ట్రియలిస్టులు, టాలీవుడ్​ ప్రముఖులు జూబ్లీహిల్స్​లో ప్రాపర్టీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత జూన్​లో జీవీకే గ్రూప్‌‌ చైర్మన్ జీవీ కృష్ణారెడ్డి రూ. 23 కోట్ల విలువైన ప్రాపర్టీని కొన్నారు.  2020 మే నెలలో న్యూలాండ్‌‌ లాబ్స్‌‌ సీఈఓ దావులూరి సుచేత్‌‌ రావు రూ. 20.7 కోట్ల విలువైన ఇల్లు కొన్నారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఇదే ఏరియాలో రూ. 27.1 కోట్లు పెట్టి రెసిడెన్షియల్‌ ప్రాపర్టీని తీసుకున్నారు.

For More News..

క్యాచ్​కు అప్పీల్​ చేస్తే ఎల్బీకి రివ్యూ చేసిండు

ఇండియాలో బిట్​కాయిన్​ను డెవలప్ చేస్తాం

ఒలింపిక్స్‌‌కు మరో ముగ్గురు ఇండియన్ రేస్‌‌ వాకర్స్‌‌