
- భద్రాద్రి జిల్లాలో పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్
భద్రాచలం, వెలుగు : ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం రూ.41లక్షల విలువైన 71 కిలోల గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలం శివారున ఇసుక ర్యాంపు సమీపంలో ఒడిశా నుంచి రాజస్థాన్ కు కారులో గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించి తనిఖీ చేశారు. రాజస్థాన్‌కు చెందిన అనిల్‌కుమార్‌శర్మ, ముఖేశ్ కుమార్‌దేవ్, పాల్వంచకు చెందిన దుర్గాప్రసాద్ విచారించి అరెస్ట్ చేయడంతో పాటు కారు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ ఎక్సైజ్సూపరింటెండెంట్తిరుపతి, ఇన్ స్పెక్టర్ రమేష్, హెడ్కానిస్టేబుల్కరీం, బాలు, కానిస్టేబుళ్లు తనిఖీల్లో పాల్గొన్నారు.