ఓపెనింగ్ అదిరింది : జస్ట్ 48 గంటలు.. 5 కోట్ల డబ్బు, 7 కేజీల బంగారం

ఓపెనింగ్ అదిరింది : జస్ట్ 48 గంటలు.. 5 కోట్ల డబ్బు, 7 కేజీల బంగారం

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.  రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, పంజాగుట్టతోపాటు పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడటంతో పోలీసులు సీజ్ చేశారు.

ఎలక్షన్ షెడ్యూల్ రిలీజైన 48 గంటల్లో  పోలీసులు రూ. 4.2 కోట్ల విలువైన 7.706 కిలోల బంగారం, రూ. 8.77 లక్షల విలువైన 11.700 కిలోల వెండి, రూ. 5.1 కోట్ల నగదు మరియు 110 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోల గంజాయి, 23 మొబైల్ ఫోన్లు, 43 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని నగర  పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.  

ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని, అక్రమ డబ్బు, మాదక ద్రవ్యాలు, మద్యం, ఉచితాలు, ఇతర ప్రలోభాలకు వ్యతిరేకంగా నగరవ్యాప్తంగా తమ అమలును ముమ్మరం చేసినట్లు సీవీ ఆనంద్  తెలిపారు.  ఎన్నికలు ముగిసే వరకు ఈ అంశాలే కీలకమని ఆయన ఉద్ఘాటించారు.