ఆటో నుండి కిందపడి 500ల నోట్ల కట్టలు

ఆటో నుండి కిందపడి 500ల నోట్ల కట్టలు

శ్రీకాకుళం మండపం టోల్ ప్లాజా వద్ద నోట్ల కట్టల కలకలం రేపాయి. టోల్ ప్లాజా వద్ద ఒ ఆటో నుండి 500 నోట్ల కట్టలు కింద పడ్డాయి. దీంతో టోల్ ప్లాజా సింబ్బంది వెంబడించారు. నిందితులు ఆటో సహా పరారైయ్యారు. ఆ ఆటో శ్రీకాకుళం నుండి నరసన్నపేట వైపు వెళ్తుండగా ఈ సంఘనట చోటుచేసుకుంది. కాగా, ఆటో నుండి కింద పడిన నోట్ల కట్టలను (88 వేలు) సిబ్బంది నరసన్నపేట పోలీసులకు అప్పగించారు. టోల్ ప్లాజా సీసీ టీవీ లో రికార్డ్ అయిన దృశ్యాలను ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.