
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రిపేర్లకు రూ. 58లక్షలను ప్రభుత్వం సాంక్షన్ చేసిందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. మంగళవారం కాలేజీని ఆయన సందర్శించారు. ప్రాక్టికల్ ల్యాబ్స్ రిపేర్లు, ఎలక్ట్రికల్, కంప్యూటర్ ల్యాబ్‌కు సామగ్రి, వాటర్ పైప్ లైన్స్, సీలింగ్ ఫ్యాన్లకు ఈ నిధులు వినియోగించాలని సూచించారు.
మైనర్ రిపేర్లకు సంబంధించి ఎస్టిమేషన్ తయారు చేయాలన్నారు. కాలేజీ ఆవరణలో ఉన్న చుంచుపల్లి గవర్నమెంట్ హైస్కూల్‌కు సంబంధించి పాత తరగతి గదుల రిపేర్లతో పాటు కిషన్ షెడ్డును పరిశీలించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో కాలేజీ ప్రిన్సిపాల్ కత్తి రమేశ్, ఇంటర్మీడియట్ ఇన్చార్జ్ జిల్లా ఆఫీసర్ సులోచనా రాణి, పీఆర్‌ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
చేపల తలలతో రుచికరమైన సూప్
చేపల తలలు, ఇతర భాగాలతో రుచికరమైన సూప్ తయారు చేసి జిల్లా వాసులకు అందించడం ద్వారా ఆరోగ్యం, ఆదాయం పొందవచ్చని కలెక్టర్ జితేశ్ సూచించారు. బోన్‌లెస్ చేపల ద్వారా పోషకాహారం, ఆదాయం పెంచుకునే మార్గాలపై ఫిష్ వ్యాపారులు, మత్స్యకారులతో కలెక్టరేట్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. చేపల్ బోన్ లెస్ కట్ విధానంపై కలెక్టర్ డెమో ఇచ్చారు. చేపలను బోన్ లెస్‌గా తయారు చేయడం ద్వారా మార్కెట్లో వాటి విలువ పెరుగుతోందని ఆయన తెలిపారు.