- ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి పట్టణాభివృద్దికి సర్కార్రూ. 62. 23 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో మరిన్ని నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు. యూఐడీఎఫ్ ద్వారా ఈ నిధులను మంజూరయినట్లు చెప్పారు.
ఈ నిధులతో జిల్లాకేంద్రంలో మున్సిపల్ పరిధిలో ఎనిమిది ప్యాకేజీల ద్వారా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలుతెలిపారు.
