కరీంనగర్‌ కిసాన్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో మార్కెట్ పనుల్లో ..రూ.87 లక్షల బిల్లులు నిలిపివేత

కరీంనగర్‌ కిసాన్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో మార్కెట్ పనుల్లో ..రూ.87 లక్షల బిల్లులు నిలిపివేత

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని కిసాన్‌‌‌‌నగర్ మార్కెట్ యార్డులో నిర్మాణంలో ఉన్న  ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ అండ్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ పనులకు సంబంధించి రూ.87 లక్షల బిల్లులను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ శుక్రవారం తెలిపారు. దీంతోపాటు ఈ నిర్మాణ పనులపై ఎంక్వైరీకి విజిలెన్స్ అండ్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ శాఖకు  సిఫారసు చేసినట్లు వెల్లడించారు.

 కిసాన్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను రూ.5.8 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. పనులు చేపడుతున్న క్రమంలోనే  మొదటి దశలో రాళ్ల తొలగింపు, మట్టి పని పేరిట నమోదు చేసిన మెజర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ బుక్(ఎంబీ రికార్డు) కనిపించకుండా పోయింది. ఈ విషయమై ఫిర్యాదులు అందడంతో అంతర్గత విచారణ జరిపి ఏడాది తర్వాత ఏఈ గఫూర్‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్ చేశారు.

 ఎంబీ  బుక్ మాయంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎంబీ రికార్డులోని వివరాలు ధృవీకరించేవరకు  ఆ పనికి సంబంధించిన రూ.87,78,242 బిల్లును తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తాజాగా మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. ఎంబీ రికార్డు మాయంపై పూర్తి స్థాయి విచారణ చేసి, బాధ్యులను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఇదే అంశంపై మాజీ కార్పొరేటర్లు  బండారి వేణు, మెండి చంద్రశేఖర్ పలుమార్లు  ఉన్నతాధికారులకు విన్నవించారు